GVK గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డి,M.D సంజయ్‌రెడ్డిపై CBI కేసు నమోదు

0
30

అమరావతి: GVK గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ గునుపాటి.వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ఎయిర్ పోర్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌రెడ్డిపై CBI కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి రూ.705 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన CBI కేసు నమోదు చేసింది..ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇందులో ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18లో బోగస్‌ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు CBI ఆరోపించింది. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్‌రెడ్డి సహా మియాల్‌, జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మరో తొమ్మిది కంపెనీలు, ఎయిర్‌ పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా CBI కేసు నమోదు చేసింది.