అనంత్‌నాగ్ ఎదురు కాల్పుల ఘటనలో 3 ఉగ్రవాదులు హతం

0
4

అమరావతి: జమ్మూ కశ్మీర్‌లో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. అనంత్‌నాగ్ జిల్లాలో నేటి ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైన్యం హతమర్చింది.అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టింది.ఈ క్రమంలో భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో,ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడి అక్కడి నుండ కాల్పులు జరిపారు.సైన్యం ఇంటిని చుట్టిముట్టి ముగ్గురు ముష్కరుల్ని హతమార్చింది.
ముందస్తు జాగ్రత్తగా సైన్యం స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.మొబైల్ సేవలపై ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతుండటంతో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు.ఈ కాల్పుల ఘటనలో ఓ సైనికుడు సైతం గాయపడినట్టు సమాచారం.పజాల్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు స మాచారం అందడంతో ఈ ప్రాంతంలోనూ సైన్యం తనిఖీలు చేపట్టింది.సైన్యంకు దొరకకుండా గాందర్బల్‌ అడవుల్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.గత వారం రోజులుగా వీరి కోసం గాలిస్తుండగా, మంగళవారం ఎట్టకేలకు చిక్కారు.