సైరా’తో (చిరంజీవితో) చాలా ఆత్మీయ సమావేశం జరిగింది-జగన్

0
24

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి,భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు.వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి.అనంతరం ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు.భోజనం చేశారు.ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జగన్ పంచుకున్నారు.’సైరా’తో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు.’చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి’ అంటూ ఆకాంక్షించారు.